![]() |
![]() |

బిగ్ బాస్ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ఇస్తున్నాడు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగార్జున స్టేజ్ పైకి రాగానే సంజనని తీసుకొని వస్తాడు. కంటెస్టెంట్స్ తో మాట్లాడి బై చెప్పి పంపిస్తు.. ఒక్క నిమిషం అంటూ వెనక్కి పిలుస్తాడు. నువ్వు మళ్ళీ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వాలంటే.. హౌస్ మేట్స్ కొందరు కొన్ని త్యాగం చెయ్యాలని నాగార్జున చెప్తాడు. మీకు బ్యాటరీ పర్సెంట్ జీరో ఉంది.. అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని నాగార్జున చెప్తాడు.
అందుకు ఇమ్మాన్యుయల్ ని కెప్టెన్సీ వదులుకోవాలని నాగార్జున చెప్తాడు. నాగార్జున ఇంకా కంప్లీట్ చెయ్యకముందే ఇమ్మాన్యుయల్ తన చేతికి ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్ ని తీసేస్తాడు. అందరు క్లాప్స్ కొడతారు. దాంతో ట్వింటీ ఫైవ్(25) పర్సెంట్ బ్యాటరీ వస్తుంది. నెక్స్ట్ చీటీలో తనూజ ఉన్నన్ని రోజులు కాఫీ తాగొద్దని ఉంటుంది. అందుకు తనూజ చాలాసేపు ఆలోచించి ఒప్పుకుంటుంది. ఇక బ్యాటరీ ఫిఫ్టీ(50) పర్సెంట్ వస్తుంది. ఆ తర్వాత శ్రీజ తన బట్టలన్నీ త్యాగం చెయ్యాలని ఆ చీటీలో ఉంటుంది. అందుకు శ్రీజ ఒప్పుకోదు. ఆ తర్వాత రీతూకి హెయిర్ కట్ చేసుకోవాలని ఉంటుంది. అందుకు రీతూ ఒప్పుకొని హెయిర్ కట్ చేసుకుంటుంది. అందుకు సెవెంటీ ఫైవ్(75) పర్సెంట్ అవుతుంది. ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నన్ని రోజులు సిగరెట్ త్యాగం చెయ్యాలని ఆ చీటీలో ఉంటుంది. కానీ అందుకు సుమన్ శెట్టి ఒప్పుకోడు. ఆ తర్వాత చివరి అవకాశంగా భరణి తన గిఫ్ట్ బాక్స్ ని స్టోర్ రూమ్ లో పెట్టాలనగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా భరణి ఆ బాక్స్ ని పెట్టేస్తాడు. దాంతో బ్యాటరీ హండ్రెడ్(100) పర్సెంట్ అవుతుంది. ఇక సంజన హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వస్తుంది.
భరణి తన గిఫ్ట్ బాక్స్ లేకుండా అసలు హౌస్ లోకి వెళ్ళనన్న వాడు ఇప్పుడు సంజన కోసం అంత త్యాగం చేసాడు. నీ కోసం త్యాగం చేసిన వాళ్ళని మర్చిపోకని సంజన తో నాగార్జున చెప్తాడు. ఇక కాసేపటికి సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అందరు వచ్చి సంజనని హగ్ చేసుకుంటారు. ఒక్క హరీష్ మాత్రం రాడు.. సంజన కూడా అతని దగ్గరికి వెళ్ళదు. ఇక సంజన గేమ్ మొదలవ్వనుందని బిబి ఆడియన్స్ అనుకుంటున్నారు.
![]() |
![]() |